రెండేళ్లుగా ఇలాగే ఉంది.. అయినా..

'నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా. నువ్వులేని జీవితాన్ని అస్సలు ఊహించలేను కూడా. నా ప్రతీ ఆలోచనలో.. ప్రతీ క్షణంలో నువ్వే. నాకంటే నువ్వే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావని తెలుసు. చిన్న పిల్లలా నన్ను గారాబం చేస్తావు. నా ప్రతీ కోరికను నెరవేరుస్తావు. నా మొండిగా ప్రవర్తించినపుడు నచ్చజెప్పుతావు. కేవలం ఏడు జన్మలకే కాదు... ప్రతీ జన్మలోనూ నువ్వే నా భర్తగా రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా' అంటూ బాలీవుడ్‌ కామెడీ క్వీన్‌ భారతీ సింగ్‌ తన భర్త హర్ష్‌ లింబాచియాపై ఉన్న ప్రేమచాటుకున్నారు. తమ రెండో వివాహ వార్షికోత్సవం సందర్భంగా మెహందీ, సంగీత్, పెళ్లినాటి వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. తనపై ఎంతగానో ప్రేమ కురిపిస్తున్నందుకు భర్తకు ధన్యవాదాలు తెలిపారు. తన భర్తే తన సోల్‌మేట్‌, బెస్ట్‌ ఫ్రెండ్‌ అని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో బీ- టౌన్‌ సెలబ్రిటీలు సహా అభిమానుల నుంచి భారతీ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.